Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 9:22 pm IST

Menu &Sections

Search

తెర వెనుక ‘జిగేలు రాణి’కి సుకుమార్ సహాయం..అందుకేనా!

 తెర వెనుక ‘జిగేలు రాణి’కి సుకుమార్ సహాయం..అందుకేనా!
తెర వెనుక ‘జిగేలు రాణి’కి సుకుమార్ సహాయం..అందుకేనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2018లో వచ్చిన పెద్ద చిత్రాలలో తాజాగా 100 రోజుల ఫంక్షన్ చేసుకొని గ్రాండ్ హిట్టు కొట్టిన చిత్రం రంగస్థలం. రాం చరణ్ సినీ కెరీర్ కే ఓ గొప్ప చిత్రంగా నిలిచిన ఈ సినిమాలో జిగేల్ రాణి సాంగ్ హైలెట్ గా నిలిచింది. తెలుగు ఆడియన్స్ ని ఊర్రూతలూగించిన పాట ఈ 'జిగేల్ రాణి'. దుమ్మురేపే బీట్ తో ఆడియన్స్ తో స్టెప్పులేయించేలా పాటని పాడింది ఓ అద్బుతమైన సింగర్. కానీ అంత మంచి పాట పాడినా ఆ సింగర్ కి రావాల్సిన పేరు మాత్రం రాలేదు. ఆమె గొంతు జనాలని చేరుకుంది కానీ ఆమె కీర్తి తెర వెనుకే మసకబారిన తుండు గుడ్డలా ఉండిపోయింది.   

rangasthalam-director-sukumar-ram-charan-samantha-

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాకి ప్రాణం పాటలే. సినిమాలో అన్ని పాటలు ఒకెత్తయితే జిగేల్ రాణి ఐటం సాంగ్ మరొకెత్తు. తెలుగు ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఉర్రూతలూగించిన పాట జిగేల్ రాణి. ఇంత అద్బుతమైన పాటని పాడింది ఏ పేరుమోసిన సింగరో అనుకుంటే పొరపాటే. ఈమె పేరే గంటల వెంకటలక్ష్మి ఊరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. రంగస్థలం సినిమాలో ఆడియన్స్ ని కిర్రెక్కించిన ఐటం సాంగ్ జిగేల్ రాణి పాటని పాడింది ఈమే.


రంగస్థలం సినిమా సూపర్ హిట్టయ్యింది అందులోని జిగేల్ రాణి పాట కూడా బంఫర్ హిట్టయ్యింది. కానీ తన గొంతుతో పాటకు ప్రాణం పోసిన వెంకటలక్ష్మి మాత్రం తెరవెనుకే ఉండిపోయింది. ఇప్పటికీ వెంకటలక్ష్మి తన కిరాణా కొట్టులో చిల్లర వ్యాపారం చేసుకుంటూనే ఉంది. జిగేల్ రాణి పాట సినిమాలో జిగేల్ మనిపించింది కానీ వెంకటలక్ష్మి జీవితంలో మాత్రం జిగేల్ నింపలేదు. పాట పాడినందుకు ఒక్క రూపాయి కూడా వెంకట లక్ష్మికి ముట్టలేదు.



సినిమాలో పాట పాడేందుకు వెంకటలక్ష్మిని మూవీటీం దెగ్గరికి తీసుకెళ్లిన మధ్యవర్తులు మోసం చేశారు. పాట పాడినందుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం మధ్యవర్తులే స్వాహా చేసేశారు. ఎప్పుడడిగినా ఏదో ఒక సమాధానం చెబుతూ వస్తున్నారు. చివరికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ నైనా కలిసి బాధని చెప్పుకుందామంటే వారి ఫోన్ నెంబర్లు కూడా వెంకటలక్ష్మికి దొరకకుండా జాగ్రత్తపడ్డారు.


మరోవైపు ఇదే విషయంపై హెచ్ఎంటీవీ రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ని సంప్రదించింది. వెంకటలక్ష్మి పరిస్థితిని తెల్సుకుని డైరెక్టర్ సుకుమార్ విచారం వ్యక్తం చేశాడు. రంగస్థలం సినిమా ఈవెంట్స్ కి ఆహ్వానించడానికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వెంకటలక్ష్మి ఫోన్ కలవలేదని బహుశా మధ్యవర్తులే ఆమెని భయపెట్టి ఉండవచ్చన్నాడు సుకుమార్. తప్పకుండా వెంకటలక్ష్మికి సాయం చేస్తామని సుకుమార్ హామీ ఇచ్చాడు. తన అద్బుతమైన గళంతో ఆడియన్స్ ని ఊర్రూతలూగించిన వెంకటలక్ష్మికి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.


rangasthalam-director-sukumar-ram-charan-samantha-
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author