శ్రీరెడ్డి మొన్నటివరకు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అని పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్ ప్రముఖల పేర్లు వెల్లడిస్తూ వీరు నన్ను సినిమా ఛాన్స్ అని పేరు చెప్పి అన్ను వాడుకొని వదిలేశారని కొంత మంది మీద ఆరోపణలు చేసింది. దానికి తెలుగు మీడియా కూడా బాగానే మద్దతు ఇచ్చి బాగానే ప్రసారం చేసింది. అయితే ఈ ఇష్యూ మధ్యలోకి పవన్ కళ్యాణ్ ను లాగేసరికి గొడవ పెద్దది అయింది. చివరికి మీడియా శ్రీరెడ్డి ని వదిలేసింది. 

Image result for srireddy

ఇక లోకల్ మీడియా తనను పట్టించుకోలేది అనుకుందో ఏమో కానీ.. ఇప్పుడు విడతల వారీగా కొత్త కొత్త పేర్లతో వస్తోంది వివాదాస్పద నటి. మొన్నేమో లారెన్స్, ఇప్పుడు సుందర్.సి, మధ్యలోకి విశాల్ పేరు.. ఇలా కోలీవుడ్ మీదా కాన్సన్ ట్రేట్ చేసింది. టాలీవుడ్ గురించి చెబితే జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదని కోలీవుడ్ జనాల పేర్లను తెరపైకి తెస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు తమిళ మీడియాకు మంచి మసాలా దొరికినట్టే. అయితే ఈమెకు భాష రాదు కాబట్టి అక్కడి టీవీ చానళ్లు బైట్స్ తీసుకోలేవేమో.

Image result for srireddy

అయినా ఇక్కడ మరో ధర్మసందేహం ఏమిటంటే.. విడతల వారీగా ఒక్కోక్కరి పేర్లూ ఎందుకు వెల్లడిస్తున్నట్టు? లారెన్స్, సుందర్.సిలు ఈమెకు మొదటి రోజే గుర్తుకు రాలేదా? అందరి పేర్లూ ఒకే రోజు చెప్పేస్తే మూడో రోజు నుంచి తనను అంతా మరిచిపోతారని.. దశలవారీగా, విడతల వారీగా.. ఈ పేర్లను బయటపెడుతున్నట్టా? ఈమెలో నటి ఏమో కానీ మంచి స్క్రిప్ట్ రైటింగ్ టాలెంట్ అయితే ఉన్నట్టుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: