ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్, “రామాయణం అనేది ఒక కథ అని, రాముడనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని కూడా తాను నమ్ముతానని, రావణుడితోనే సీత ఉంటే బాగుండేదేమోనని, ఆమెకు న్యాయం జరిగి ఉండేదని తాను భావిస్తున్నానని” వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ పెద్ద రగడ జరిగింది.   
Kathi Mahesh - arrested
ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి కత్తి వ్యాఖ్యలపై విరుచుకు పడటమే కాదు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోక పోతే తాము ఉద్యమం చేస్తామని చెప్పడంతో...భద్రతా చర్యల దృష్ట్యా కత్తి మహేష్ ని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేశారు.  అనంతరం అతడి స్వస్థలమైన చిత్తూరు జిల్లాలోని యల్లమంద గ్రామంకు తీసుకెళ్లి వదిలిపెట్టారు.  తాజాగా శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నగర బహిష్కరణకు గురై చిత్తూరు చేరుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Image result for కత్తి మహేష్ అరెస్ట్
తొలుత మదనపల్లెకు తరలించిన పోలీసులు అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్టు సమాచారం.  సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకస్మాత్తుగా కత్తి ప్రత్యక్షమయ్యాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మదనపల్లెకు, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. కాగా,  కత్త మహేష్ అంటే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని..ఒకవేళ తను కనుక మీడియా సమావేశం పెడితే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే ఉద్దేశంతోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: