అజయ్ భూపతి డైరక్షన్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఆరెక్స్ 100 మూవీ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ మీద రైడ్ చేస్తుంది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు బీభత్సంగా నచ్చేసింది. అందుకే సినిమా చూసే ఆడియెన్స్ లో వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది.


ఈ సినిమాలో హీరో కార్తికేయ కొత్త హీరో సరే చాలా బాగా నటించాడు. దర్శకుడు అజయ్ భూపతి కథ, కథనాలు ఆడియెన్స్ మెప్పు పొందాయి. అయితే ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా సక్సెస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సినిమాలో రెచ్చిపోయి మరి నటించిన అమ్మడు అందుకు తగిన క్రేజ్ సంపాదించింది.  


కేవలం 6 లక్షల పారితోషికం తీసుకుని ఈ రేంజ్ లో అమ్మడు రెచ్చిపోవడం చూసి అందరు అవాక్కవుతున్నారు. అయితే ఇంతకుముందు బాలీవుడ్ సీరియల్స్ లో పాయల్ నటించింది. దాదాపు 8,9 సీరియల్స్ లో నటించిన అమ్మడు ఓ పంజాబి సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.


సీరియల్స్ లో పాయల్ ఏమాత్ర బెరుకు లేకుండా రెచ్చిపోయిందని తెలుస్తుంది. సీరియల్స్ చేస్తూనే మరో పక్క ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరించింది ఈ చిన్నది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాపు లేపుతున్న అందాల భామ పేరు పాయల్ రాజ్ పుత్. ఆరెక్స్ 100 కు 6 లక్షలే తీసుకున్నా ఇక మీదట అమ్మడు తన రేంజ్ కు తగినట్టు పారితోషికం పెంచుకునే ఛాన్స్ ఉంది.      




మరింత సమాచారం తెలుసుకోండి: