ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా సుధీర్ బాబు సొంతంగా భలే మంచి రోజు హిట్ అందుకున్నాడు. అయితే నటన పరంగా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆ హిట్ మజాను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు.


ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ బాబు లీడ్ రోల్ లో వచ్చిన సినిమా సమ్మోహనం. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మాత్రమే నచ్చేలా కథ, కథనాలు ఉన్నాయని కామెంట్స్ వచ్చినా ఫైనల్ గా సినిమా సుధీర్ బాబు ఖాతాలో హిట్ మూవీగా నిలిచింది.


7 కోట్ల (థియేట్రికల్ రైట్స్) ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫైనల్ గా 8 కోట్లపైగా కలక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. ఇక ఏరియాల వారిగా సమ్మోహనం కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..       


నైజాం : 1.7 కోట్లు
సీడెడ్ : 0.50+ కోట్లు
గుంటూర్ : 0.30 కోట్లు
కృష్ణా : 0.50 కోట్లు
ఈస్ట్ : 0.25 కోట్లు
ఓవర్సీస్ : 0.90 కోట్లు
శాటిలైట్ రైట్స్ 3 కోట్ల దాకా పలికాయని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: