ఈటివి డ్యాన్స్ షో ఢీ 10వ సీజన్ ఫైనల్స్ కు చేరుకుంది. ఒకప్పుడు జెమినిలో వచ్చే డ్యాన్స్ బేబి డ్యాన్స్ తర్వాత ఆ రేంజ్ లో క్లిక్ అయిన షో ఢీ. ఏకంగా 10 సీజన్లను పూర్తి చేసుకుంది అంటే ఆ షో క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. డ్యాన్స్ లో దమ్ము చూపిస్తున్న కంటెస్టంట్స్ తో షో రసవత్తరంగా మారింది.


ఇక ఢీ-10లో కంటెస్టంట్స్ పర్ఫార్మెన్సెస్ తో పాటుగా ప్రదీప్ యాంకరింగ్.. టీం మెంటర్స్ సుధీర్, రష్మిల కామెడీ కూడా షో సక్సెస్ లో భాగమని చెప్పొచ్చు. శేఖర్ మాస్టర్, ప్రియమణి, అని మాస్టర్ జడ్ మెంట్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఇక ఈ సీజన్ ఫైనల్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. 


తారక్ ఎంట్రీ అదిరిపోగా ఆ తర్వాత షో అంతా సరదాగా సాగింది. మధ్యలో అక్సా ఖాన్ తో కలిసి స్వింగ్ జరా సాంగ్ ఫ్యాన్స్ ను అలరించింది. ఇక ప్రదీప్, సుధీర్, రష్మి, వర్షిణిల కామెడీకి తారక్ ఎంజాయ్ చేశాడు. ఫైనల్ గా కంటెస్టంట్ రాజు ఈసారి టైటిల్ విన్నర్ అయ్యాడు. చిట్టి మాస్టర్, రాజుల కష్టం ఫైనల్ గా వారిని విజేతలుగా నిలిచేలా చేసింది.


ఈటివి క్రేజీ డ్యాన్స్ షో ఢీ సీజన్లలో రెండో సీజన్ ఢీ-2కి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఢీ-10 ఫైనల్స్ కు గెస్ట్ గా వచ్చారు. మొత్తానికి ఎన్.టి.ఆర్ మనసులు గెలవడమే కాదు టైటిల్ విన్నర్ గా నిలిచిన రాజు, చిట్టి ఇక మీదట కూడా ఇదే రేంజ్ లో కొనసాగిస్తారని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: