బిగ్ బాస్ సీజన్-1 ఎంత సక్సెస్ అయ్యిందో సీజన్-2 అంత దారుణంగా తయారయ్యింది. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్టింగ్ మాత్రమే కాదు ప్రతి టాస్క్.. ప్రతి సెగ్మెంట్ చాలా ఎక్సైటింగ్ గా సస్పెన్స్ గా ఉండేవి. కాని బిగ్ బాస్-2కి వచ్చే సరికి కాస్త ఆ ఎక్సైట్మెంట్ తగ్గింది.  


ఇక బిగ్ బాస్ సీజన్-2కి మరో దెబ్బ ఏంటంటే బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయడమే. తొలి సీజన్ పూణేలో సెట్ వేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అన్నది కేవలం షోలోనే చూసే వాళ్లం. అయితే ఈసారి హైదరాబాద్ నడిబొడ్డున బిగ్ బాస్ సెట్ వేసేసరికి అంతా ముందే లీక్ అవుతుంది.


ముఖ్యంగా సస్పెన్స్ గా ఉండాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ ముందే లీక్ అయ్యి ఏమాత్రం షో మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. బిగ్ బాస్ నుండి వస్తున్న ఈ బిగ్ లీక్స్ నిర్వాహకులను ఇబ్బందుల్లో పడేస్తుంది. శ్యామాల, భాను ఎలిమినేషన్స్ ముందే లీక్ అవడం జరిగింది. ఇప్పుడు ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని మీద కొన్ని లీక్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.


లీకైన పిక్స్, గ్రాఫ్ లను చూస్తే ఈ వారం సామ్రాట్ రెడ్డి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేస్తాడని తెలుస్తుంది. ఆదివారం తేలాల్సిన ఎలిమినేషన్ గురువారానికే లీక్ అయ్యాయంటే ఈసారి బిగ్ బాస్ లీక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. లీక్ అయ్యాయి కాబట్టి వేరే ఎవరినైనా ఎలిమినేట్ చేస్తారా లేక లెక్క ప్రకారం సామ్రాట్ బయటకు వస్తాడా అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: