టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు.  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల జోరు పెరిగిపోయింది.  ఫ్యాన్స్ కి స్టార్ హీరోల మీద ఎంత అభిమానం ఉంటుందో అంతే క్రేజ్ వాళ్ల పిల్లలపై కూడా ఉంటుంది.  ఈ మద్య ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని వీరంతా తమ పిల్లల ఫోటోలు సోషల్ మాద్యమాల్లో షెర్ చేస్తూ తెగ సంబరి పోతున్నారు.  అయితే మహేష్ బాబు సినిమా హీరోగా ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ చూపిస్తారు.
Image result for mahesh babu family
ప్రతి సంవత్సరం తన కుటుంబంతో విదేశాల్లో ఎంజాయ్ చేసి వస్తుంటారు.  ఆ సమయంలో ఎన్నో ఫోటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.  సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ నాన్న కృష్ణతో కలిసి శంఖారావం-కొడుకు దిద్దిన కాపురం-ముగ్గురు కొడుకులు-గూఢచారి 117 లాంటి ఎన్నో హిట్ మూవీస్ లో నటించాడు.  మహేష్ వారసుడిగా గౌతమ్ ని ఇప్పటి నుంచే చూసుకుంటున్న ఫాన్స్ కు తను స్క్రీన్ మీద ఎలా ఉంటాడో చిన్న సాంపిల్ రూపంలో వన్ నేనొక్కడినే ఆల్రెడీ  చూసారు.

నటన పరంగా కూడా నాన్నకు తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.  ఈ మద్య గౌతమ్ ఫోటోలు ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ ఫోటోలో మహేష్ భుజాల వరకు కనిపిస్తున్నాడు గౌతం.  అంతే కాదు అచ్చం తండ్రి పోలికలు ఉండటంతో..తమ హీరో వారసుడు త్వరలో ఎంట్రీ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.  హీరో ఫీచర్స్ అప్పుడే కనిపించడం చూసి ఘట్టమనేని ఫాన్స్ ఆనందం మునిగిపోతున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: