టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ఎవరైనా ఉన్నారంటే మొదటగా మనకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ వయసు 35 దాటి పోవడంతో ఇతని పెళ్లి గురించి ఎప్పుడు వదంతులు వస్తూనే ఉన్నాయి.  బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ పెళ్లి వుంటుందని వార్తలొచ్చాయి. బాహుబలి సినిమా రిలీజైనా.. వెంటనే సాహో సినిమాకు కమిటైన ప్రభాస్, పెళ్లి విషయాన్ని పక్కనబెట్టేశాడు. ఈ నేపథ్యంలో తొలుత బిల్లా, తర్వాత మిర్చి, ఆపై బాహుబలిలో కలిసి నటించిన ప్రభాస్- అనుష్కల మధ్య ప్రేమ చిగురించిందని వార్తలొచ్చాయి. 

Image result for prabhas and anushka

ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతీ కూడా తెలిసిందే. ఈ వార్త బాగా వైరల్ అయ్యింది అయితే ఇదే విషయం గురించి అనుష్క ప్రభాస్ కూడా స్పందించారు. ఇందులో ఎటువంటి నిజం లేదని అవన్నీ పుకార్లు మాత్రమే అని తేల్చిపారేశారు. మరియు మాకు అటువంటి ఉద్దేశం లేదని, మేము జస్ట్ స్నేహితులం మాత్రమే అని చెప్పినారు. ఇదే విషయం గురించి తాజాగా ప్రభాస్ తల్లి స్పందించారు. 

Image result for prabhas and anushka

తాజాగా ప్రభాస్-అనుష్క వివాహ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. వాళ్లిద్దరూ స్టార్స్ అని, వీరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయని తెలిపారు. అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్ కావాలనే ఉంది కానీ, వాళ్లిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. ఇకనైనా వారి పెళ్లి గురించి వస్తున్న వదంతులను ఆపాలని ఆమె కోరారు. ఇంతకుముందు ప్రభాస్‌తో పెళ్లి వదంతులపై అనుష్క స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులమని, బాహుబలి-దేవసేన కెమిస్ట్రీ తెరపైకే పరిమితమని నిజజీవితంలో ఆ కెమిస్ట్రీని ఎదురుచూడొద్దంటూ ఫ్యాన్సును కోరిన సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: