టాలీవుడ్ లో ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు హీరోలు వచ్చారు..మొదటి సారిగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ‘ఒకే మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ..నిహారికకు మంచి నటిగా గుర్తింపు వచ్చింది.  ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక, ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ విడుదలకు ముస్తాబవుతున్నది.
Image result for నిహారిక సినిమా హ్యాపీ వెడ్డింగ్
ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌, పాకెట్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు .. పాకెట్ సినిమా వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తితో వున్నారు.

ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడనున్నామని భావిస్తున్నారు.  టీజర్, ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఈ ఫ్యామిలీ రొమాంటిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తిగా ఫ్యామిలీ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమా రెండు కుటుంబాల మద్య పెళ్లి సంబంధం ఎలా కుదిరింది..ఎలా విడిపోయిందీ మళ్లీ ఆ జంట ఎలా కలుసుకున్నారు..అనే నేపథ్యంలో సాగుతుందట.  కాగా ఈ ఫ్యామిలీ రొమాంటిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: