మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో పది సంవత్సరాలు ఉన్న విషయం తెలిసిందే.  దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఆయన హుందాతనానికి తగ్గ సినిమా అని తెలుగు ప్రేక్షకులు అద్బుత విజయం అందించారు.  అప్పటి వరకు చిరంజీవి మళ్లీ తన స్టామినా చాటుతారా అన్న వారందరూ..‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చూసిన తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబర పడ్డారు. ఇక మెగా స్టార్ అభిమానులకి ఆగస్ట్ నెల అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ నెలలోనే చిరంజీవి పుట్టిన రోజు కూడా ఉంది.   మెగా హీరోలు కూడా మెగా స్టార్ పుట్టిన రోజుకి తమ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు.
Image result for saira narasimha reddy
అయితే ఈ పుట్టిన రోజు సంధర్బంగా మాత్రం తండ్రి, కొడుకులు ఇద్దరు తమ తమ సినిమాల ఫస్ట్ లుక్స్ తో వచ్చి అదరగోడతారు అట. చిరంజీవి కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న 'సైరా' నుంచి ఆగస్టు 22వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోందట.
Related image
ఇలా ఒకే రోజున చిరంజీవి .. చరణ్ సినిమాల నుంచి ఫస్టులుక్స్ రానున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.  రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ తో తండ్రి కొడుకులు అభిమానులని సంతోషపెట్టడానికి రెడీ అయ్యారు.  ఇలా ఒకే రోజున చిరంజీవి .. చరణ్ సినిమాల నుంచి ఫస్టులుక్స్ వస్తున్నాయని వార్త సోషల్ మీడియాలో రావడంతో మెగా అభినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: