నాగశౌర్య ఏంటి నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వడం ఏంటని కాస్త కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. యువ హీరోల్లో హిట్ ఫ్లాపులను సమతూకం వేసుకుంటూ వస్తున్న నాగశౌర్య తన లాస్ట్ మూవీ ఛలోతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.


ఛలో సినిమా తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించాడు నాగశౌర్య. ఇక ప్రస్తుతం తన బ్యానర్ లో రెండో సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా @నర్తనశాల అని నిర్ణయించారు. నర్తనశాల అనగానే ఎన్.టి.ఆర్ నటించిన సినిమా గుర్తుకురాక మానదు. 


అదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా చేయాలని బాగా ప్రయత్నించాడు కాని కుదరలేదు. ఫైనల్ గా నాగశౌర్య హీరోగా @నర్తనశాల మూవీ వస్తుంది. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాకు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. 


నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ నాగశౌర్య నర్తనశాల టైటిల్ వాడేస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తే ఇదేదో డ్యాన్స్ స్టెప్పులా జోష్ గా కనిపిస్తున్నాడు నాగశౌర్య. కాని పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం అదిరిపోయింది. సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి మళ్లీ నాగశౌర్య హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్న ఈ సినిమాపై నాగశౌర్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: