కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ పై విరుచుకుపడుతోన్న శ్రీరెడ్డి, ఒక్కసారిగా కోలీవుడ్ ను టార్గెట్ చేసేసింది. మురుగదాస్ .. లారెన్స్ .. సుందర్.సి .. శ్రీరామ్ (శ్రీకాంత్)పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.  మొన్నిటి వరకు టాలీవుడ్ ని టార్గెట్ చేసుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ టార్గెట్ చేసుకోవడంతో అక్కడ ఇండస్ట్రీలో కూడా ప్రకంపణలు మొదలయ్యాయి. గతంలో సుచీలీక్స్ తో పెద్ద తలనొప్పులు ఎదుర్కొన్న కోలీవుడ్ నటులు ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్ తో పిచ్చెక్కిపోతున్నారు.  


తాజాగా శ్రీరెడ్డి పై ఒక్కక్కరూ ఫైర్ అవుతున్నారు.  కోలీవుడ్ పై నటి శ్రీ రెడ్డి ఎక్కుపెట్టిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై నటుడు కార్తీ పెదవి విప్పారు. నడిగర్ సంఘం కోశాధికారి గా ఉన్న అయన ఈ విషయమై సంఘం తరపున అధికారికంగా స్పందించబోతున్నట్లు తెలిపారు. “మీడియా కూడా ఇలాంటి పనికిమాలిన విషయాలపై దృష్టి ఉంచుకుంటే మంచిది .

Image result for karthi serious

 శ్రీ రెడ్డి దగ్గర ఆధారాలు ఉండుంటే,ఇప్పటికే ఆమె పోలీసుల దగ్గరకి వెళ్లి ఉండేది,అయితే ఆమె ఆలా చేయకుండా అందరి మీద ఆరోపణలు చేస్తుంది,కాబట్టి ఈ విషయమై ఇప్పుడు నేను ఏమి మాట్లాడదల్చుకోలేదు” అంటూ తెలిపారు కార్తీ . జానిజాలు ఎంతవరకూ అనే విషయాన్ని పక్కన పెట్టేసి, శ్రీరెడ్డి ఆరోపణలను హైలైట్ చేయడం ఎంతవరకూ సమంజసమో మీడియానే ఆలోచించుకోవాలని అన్నారు. త్వరలోనే ఈ విషయంపై 'నడిగర్ సంగం' స్పందిస్తుందని ఆయన చెప్పారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: