బిగ్ బాస్ మొదటి సీజన్ లో జరగని ఎన్నో పరిణామాలు సెకండ్ సీజన్ లో జరుగుతున్నాయి. నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 ఇప్పటికే ఐదుగురి ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేశారు. లాస్ట్ వీక్ భాను శ్రీ ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ ఈ సీజన్ అంచనాలకు అందదని తెలుస్తుంది.


ఇప్పటికే బిగ్ బాస్ లీక్స్ సంచలంగా మారుతున్న ఈ సమయంలో షో మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగేందుకు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కొందరి ఇంటి సభ్యులను వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి ఒకసారి ఎలిమినేట్ అయిన సభ్యులు ఎలా మళ్లీ బయటకు వస్తారు అంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చేలా ఈ ప్రయత్నం చేస్తున్నారట.


ఇక ఐదుగురి ఇంటి సభ్యులలో భాను, నూతన్, శ్యామలా ఎదుటి వాళ్ల తప్పుల వల్ల ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఆ వారం ఎలిమినేట్ అయినా ఆడియెన్స్ లో ఎక్కడో వారు మళ్లీ బిగ్ బాస్ లోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే ఈసారి కొత్తగా బిగ్ బాస్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని హౌజ్ లోకి మళ్లీ ఆహ్వానిస్తున్నారట. 


భాను.. నూతన్.. శ్యామలా ఈ ముగ్గురిలో నాని ఈ వారం పోల్ పెట్టి ఒకరిని ఇంటిలోకి ఆహ్వానిస్తారట. ముగ్గురిలో ఎవరు వస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. భాను శ్రీ ఎలిమినేషన్ ఎవరు ఊహించలేదు. అయితే ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: