బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఆరోవారం ఎలిమినేషన్ లో నామినేషన్ లో ఉన్న దీప్తి, రోల్ రైడా, సామ్రాట్, తేజశ్వి, తనీష్ లలో ముగ్గురు సేఫ్ జోన్ లోకి ఉన్నారని చెప్పాడు నాని. ఫైనల్ గా ఈ వారం తేజశ్వి, సామ్రాట్ లలో ఒకరు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. 


హౌజ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సామ్రాట్, తేజశ్విలు ప్రేమ పక్షులుగా మారారు. మొదటి వారం నుండి సామ్రాట్ తేజూ క్లోజ్ గా హౌజ్ లో ఉంటున్నారని.. ఆమె ప్రభావం సామ్రాట్ మీద పడిందని నాని అంటూనే ఉన్నాడు. సామ్రాట్ సింగిల్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.   


అయితే ఈ వారం ఎలిమినేషన్ లో సామ్రాట్, తేజశ్విలలో ఎవరు ఇంటి నుండి బయటకు వస్తారో చూడాలి. లీకులను బట్టి సామ్రాట్ బయటకు రావడం కన్ఫాం అని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ లీక్స్ సంచనలనం కాగా సామ్రాట్ ను కాకుండా తేజశ్విని బయటకు పంపించినా పంపిస్తారని అంటున్నారు.


మరి ఈ వారం ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేమ జంటని విడగొడుతున్నారని చెప్పొచ్చు. శని వారం హౌజ్ మెట్స్ తీసిన సినిమా గురించి డిస్కస్ చేసిన నాని ఆది వారం ఎపిసోడ్ లో ఏం చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తేజశ్వి, సామ్రాట్ లలో ఎవరు బిగ్ బాస్ హౌజ్ వదిలివెళ్తారో ఈరోజు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: