మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైది నంబర్ 150తో అదిరిపోయింది. పదేళ్ల తర్వాత తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న మన మెగాస్టార్ ఈసారి భారీ బడ్జెట్ తో భారీ సంచలనాలనే టార్గెట్ చేసుకున్నాడు. 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు చిరంజీవి.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా రాబోతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ సైరా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ గురించి మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే టైటిల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసిన చిత్రయూనిట్ మెగాస్టార్ బర్త్ డే నాడు సినిమాకు సంబందించిన 1 మినిట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆగష్టు 22న చిరు బర్త్ డే.. ఆరోజు సైరా టీజర్ వదులుతారట. టీజర్ తోనే సినిమా సత్తా ఏంటో చూపించాలని జాగ్రత్త పడుతున్నారు. 


2019 సమ్మర్ భరీలో దిగుతున్న ఈ సైరాలో చిరు లుక్ అదిరిపోతుందని అంటున్నారు. లీకైన పిక్స్ ఓకే అనేలా ఉండగా వాటి కన్నా అఫిషియల్ లుక్ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు. మెగాస్టార్ ఎన్నేళ్లగానే చేయాలనుకున్న ఈ మూవీ ఇన్నాళ్లకు కుదిరింది. నయనతారతో పాటుగా అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి వారు కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: