టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరియర్ దాదాపు ముగించేసింది అనుకున్న టైంలో మళ్లీ వరుస స్టార్ అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం మళ్లీ బీభత్సమైన ఫాంలో ఉంది. అయితే సినిమాలు తగ్గుతున్నాయ్ అనుకున్న టైంలో కెరియర్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ చేసింది కాజల్.


సినిమాతో పాటుగా ఆ సినిమాలో కాజల్ పక్కా లోకల్ ఐటం సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. కాజల్ అందాలను మళ్లీ కుర్రాళ్లను పిచ్చెక్కించేలా చేసింది. ఆ తర్వాత అమ్మడి ఆఫర్లు డబుల్ అయ్యాయని చెప్పొచ్చు. కాజల్ చేసిన ఐటం సాంగ్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పరచుకుంది. 


అయితే ఎలాగు ఒకసారి ఐటం సాంగ్ చేసింది కదా అని మళ్లీ మరోసారి అమ్మడి చేత అలాంటి ఐటం ప్లాన్ చేశారట. ఓ స్టార్ హీరో సినిమాలో కాజల్ ఐటం ప్లాన్ చేశారట. కాని కాజల్ అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. భారీ పారితోషికం ఆఫర్ చేసినా సారీ అనేసిందట. అంతేకాదు ఇక మీదట అసలు ఐటం సాంగ్ ప్రస్థావనే తన దగ్గర రావొద్దని చెప్పిందట.


మరి పక్కా లోకల్ తో పాపులారిటీ పెరిగినా కాజల్ ఎందుకు ఐటం సాంగ్ చేయనందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తున్న అమ్మడు ఫాం కోల్పోతే కాని వచ్చిన ఈ ఐటం అవకాశాలను చేస్తుందని అంటున్నారు. అమ్మడు ఏం చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: