మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎంత మంది వచ్చినా హీరోయిన్ గా నిహారిక రావడం అన్నది పెద్ద సాహసమే. ఒక మనసు సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది నిహారిక కొణిదెల.


సుమంత్ అశ్విన్ హీరోగా లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా పెళ్లికి ముందు జరిగే హంగామా ఎలా ఉంటుందో చూపించే కథతో వస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ కాబట్టి నిహారిక మీద ఫోకస్ బాగానే ఉంటుంది.


ఈ క్రమంలో ఆమె పై రూమర్స్ కూడా చాలా ఎక్కువే. ఒకమనసు సినిమాలో నాగశౌర్యతో జత కట్టగా ఆ సినిమా టైంలో నాగశౌర్యతో నిహారిక లవ్ లో పడిందని టాక్ బాగా వచ్చింది. అంతేకాదు నాగశౌర్య తర్వాత ప్రభాస్ తో నిహారిక మ్యారేజ్ అని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. 


అయితే ఈ వార్తలపై నిహారిక స్పందించింది. అవన్ని స్పైసీ హెడ్ లైన్స్ అని అన్నది. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది నిహారిక. హ్యాపీ వెడ్డింగ్ కమర్షియల్ సక్సెస్ అందుకుని ఆమె కెరియర్ కు జోష్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత సూర్యాకాంతం రోల్ లో నటిస్తుందట నిహారిక. 



మరింత సమాచారం తెలుసుకోండి: