నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ అందరికి శత్రువుగా మారాడు. ముఖ్యంగా తనీష్, సామ్రాట్, బాబు గోగినేని, నందిని కలిసి ప్రతి సోమవారం జరిగే నామినేషన్ లో కౌశల్ ను నామినేట్ చేశారు. దాదాపు ఇంటి సభ్యులలో 8 మంది కౌశల్ ను నామినేట్ చేశారు. ఈసారి గుడ్డు తలపై కొట్టి నామినేట్ చేయాల్సి ఉండగా కౌశల్ తలపై 8 గుడ్లు పగిలాయి.


అయితే మిగతా వారి టార్గెట్ ఎలా ఉన్నా రోల్ రైడా, అమిత్ లు కూడా కౌశల్ ను నామినేట్ చేశారు. అది కూడా గేమ్ లో సీరియస్ నెస్, ఫోకస్ ఉండాలని వారికి పదే పదే చెప్పాడని కౌశల్ ను నామినేట్ చేశారు. ఇక మిగతా వారంతా కౌశల్ గేమ్ ఆడేందుకు వచ్చాడు అందుకే అతన్ని నామినేట్ చేశామని అన్నారు.


కౌశల్ ఈ వారం బాబు గోగినేని, నందినిలను నామినేట్ చేశారు. నందినిని తను సేవ్ చేసినా ఆమె ఫ్రెండ్ షిప్ కు ద్రోహం చేసిందని అన్నాడు కౌశల్ ఇక బాబు గోగినేని రాజమౌళి, కీరవాణిలను ఇన్సల్ట్ చేసినందుకు అతన్ని నామినేట్ చేశారు. ఇక గేమ్ ఆడేందుకే కౌశల్ వచ్చాడన్న వారికి సమాధానంగా అవును తాను గేమ్ గేమ్ లానే ఆడేందుకు వచ్చా కాని చపాతీలు చేసుకునేందుకు కాదు అని అన్నాడు.   


బయట ఆల్రెడీ కౌశల్ ఆర్మీ అతనికి సూపర్ ఫ్యాన్స్ గా మారి ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కౌశల్ కోపాన్ని కూడా వీరు ప్రమోషన్స్ కు వాడుకుంటారు. మొత్తం మీద కౌశల్ గేమ్ ఆడేందుకే బిగ్ బాస్ కు వచ్చా అని అందరి ముందు ఒప్పుకోవడం సర్ ప్రైజ్ చేసింది. మిగతా వారంతా ఒకవైపు కౌశల్ ఒక్కడు ఒకవైపు అయ్యే సరికి ఆడియెన్స్ దృష్టిలో కౌశల్ హీరో అయ్యాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: