బిగ్ బాస్ హౌజ్ లో అందరు ఒక సైడ్ అయితే కౌశల్ ఒక్కడే ఒక సైడ్ అయ్యాడు. మొదటి నుండి కౌశల్ సెపరేట్ గా ఉంటూ వస్తున్నాడు. కొంతమందితో తప్ప కౌశల్ అందరితోనూ ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకున్నాడు. అయితే హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ లో ఒకరైన కౌశల్ తను చేసే కొన్ని పనుల వల్ల కంటెస్టంట్స్ అందరికి శత్రువుగా మారుతున్నాడు.


బయట చూస్తే కౌశల్ ని ఒక హీరోగా భావిస్తూ కౌశల్ ఆర్మీ అంటూ కొంతమంది కౌశల్ గా ఎగైనెస్ట్ ఎవరుంటే వారిని ఎలిమినేట్ చేసేలా ఓటింగ్స్ వేస్తున్నారు. ఈసారి నామినేషన్ ప్రక్రియలో కూడా ఈ టాపిక్ వచ్చి కౌశల్ దాని గురించి మాట్లాడేలా చేశాడు. అయితే ఫైనల్ గా కౌశల్ తో ఉన్నంతలో పొరాడింది మాత్రం తేజశ్వినే.


ఆదివారం ఎలిమినేట్ అయిన తేజశ్వి కౌశల్ మీద మొదటి నుండి నెగటివ్ ఒపీనియన్ మీద ఉంది. ఇక బయటకు వచ్చాక కౌశ ఆర్మీ వల్లే తన ఎలిమినేషన్ జరిగిందని మళ్లీ ఇంట్లోకి వెళ్లాలని చూస్తుంది. మొదటి సీజన్ లో ఒకసారి ఎలిమినేట్ అయి బయటకు వస్తే వెళ్లడం కుదరదు కాని ఉంటే గింటే కంటెస్టంట్స్ తో కాకుండా సీక్రెట్ గా బిగ్ బాస్ ఉంచుతాడు (లాస్ట్ సీజన్ ముమైత్ ఉన్నట్టుగా) కాని బిగ్ బాస్ నుండి బయటకు రారు. కాని ఈసారి ఎలిమినేట్ అయిన వారిని మళ్లీ హౌజ్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.  


దానికి ఓటింగ్ సిస్టెం పెట్టారు. హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ తో పాటుగా ఆడియెన్స్ కూడా ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. సో మొత్తానికి మొదటి వారం సంజనా నుండి ఈవారం బయటకు వచ్చిన తేజశ్విలలో ఎవరో ఒకరు మళ్లీ ఇంటిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: