అల్లు అర్జున్ లాస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనితో స్టార్ హీరోలా రేస్ లో వెనుకకి పడిపోయాడు ఒక పక్క తన తోటి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వరుస హిట్స్ తో దూసుకు పోతున్నారు. మరో రెండేళ్లు వరకు వీరి డేట్స్ ఖాళీగా లేవు అయితే ప్రస్తుతం బన్నీ పరిస్థితి దీనికి భిన్నముగా ఉంది. ఇంత వరకు ఒక కథ కూడా ఫైనల్ కాలేదు. డైరెక్టర్ కూడా ఫైనల్ కాలేదు. దీనితో బన్నీ కి ఏమైంది అని సందేహాలు వస్తున్నాయి. 

Image result for allu arjun

అయితే బన్నీ క్యాంపు లో జనాలు కూడా మారినట్లు సమాచారం. బన్నీకి ఇన్నాళ్లు అన్నీ బన్నీవాసే. కానీ బన్నీవాసు ఇప్పుడు చాలా వ్యవహారాలు చూస్తున్నారు. జిఎ-2 బ్యానర్ లో నిర్మాణ వ్యవహారాలు, గీతాసంస్థ వ్యవహారాలు ఇలా. బహుశా అందుకే కావచ్చు, బన్నీ దగ్గర సాయి చేరినట్లు తెలుస్తోంది. ఈ సాయి ఎవరో కాదు. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన దగ్గర వుండే వేరే వ్యక్తి కారణంగా, త్రివిక్రమ్ కు సాయికి మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి.

Image result for allu arjun

దాంతో దాదాపు రెండు మూడేళ్లుగా సాయి దూరంగా వుంటున్నారు త్రివిక్రమ్ కు. మొత్తంమీద సరైన లైనప్ లు లేకపోవడం, మిగిలిన హీరోల చేతుల్లో ఒకటికి రెండు మూడు సినిమాలు వుండడం, బన్నీలో చాలా మార్పులే తెస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇండస్ట్రీలో చెప్పుకునేది వేరు. బన్నీ క్యాంప్ లోకి వెళ్తే దర్శకులను కట్టేస్తారని, ఎప్పటికీ ప్రాజెక్టులు ఎక్కనివ్వరని, అలా అని బయటకు వెళ్లనివ్వరని, అందుకే డైరక్టర్లు ఎవ్వరూ అటు చూడడంలేదని ఇండస్ట్రీ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: