సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ సినిమాలకు కొత్త క్రేజ్ వచ్చేలా చేసిన మహేష్, వెంకటేష్ ఆ సినిమాతో స్టార్స్ అందరికి షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి అడపాదడపా మల్టీస్టారర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం నాగార్జున, నాని కలిసి దేవదాసు సినిమా చేశారు.


శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో అశ్వనిదత్ ఆ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్.. వెంకటేష్, నాగ చైతన్య కూడా మల్టీస్టారర్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున, నానిల మల్టీస్టారర్ మూవీలో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుండగా ఆ పాత్ర చివర్లో విశాదాంతం అవుతుందని అంటున్నారు.  


నాని డాక్టర్ గా నటిస్తున్న దేవదాసు సినిమాలో నాగార్జున పాత్ర చివర్లో చనిపోతుందట. అయితే అసలే ఆఫీసర్ దెబ్బతో కెరియర్ రిస్క్ లో పడేసుకున్న నాగార్జున ఇప్పుడు దేవదాసు సినిమాలో కూడా చనిపోయే పాత్ర చేయడం అక్కినేని ఫ్యాన్స్ కు కంగారు పెట్టిస్తుంది. సినిమా రిజల్ట్ మీద కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది.   


నాగార్జున మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట. అంతేకాదు 15 ఏళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. బ్రహ్మస్త్ర సినిమాలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసమే నాగ్ ముంబైకి వెళ్లారు.



మరింత సమాచారం తెలుసుకోండి: