త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న ఎన్టీఆర్ సినిమా మీద ఇప్పటికే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మొదటి సారిగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తుండటం వల్లన సినిమా ఎలా ఉండ బోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా కు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఇండస్ట్రీ రికార్డ్స్ చెరిగి పోతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని లీకులు వస్తున్నాయి. 

Image result for trivikram

అరవింద సమేత సినిమా ఆరంభంలోనే ఓ జాలి కమ్ జోల పాట లాంటిది వుంటుందని తెలుస్తోంది. ఇది ఓ తల్లి పిల్లాడికి జోల పాటగా పాడుతుందట. ‘పెనిమిటీ.. ఓ పెనిమిటీ’ అనే టైపులో. అయితే భాష తెలియని వయసులో పిల్లాడు జోలపాటే అనుకుంటాడు. కానీ తెలిసిన తరువాత అర్థం అవుతుంది. అది తల్లి జాలి పాట అని. ఆమె తన భర్త కోసం పాడుతోందని. అన్నట్లు ఈ పాటను థమన్ సూపర్ గా ట్యూన్ చేసాడని కూడా తెలుస్తోంది.

Image result for trivikram

అంటే ఇదంతా ఏదో రివెంజ్ స్టోరీకి దారితీసేలాగే కనిపిస్తోంది. అన్నట్లు సినిమా ఆరంభంలోనే భారీ ఎపిసోడ్ కూడా ఏదో వుంటుందని వినిపిస్తోంది. అక్టోబర్ 11 లేదా 12న విడుదలయ్యే అరవింద సమేత సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: