ఈ మద్య టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  రిసెంట్ గా సినియర్ నటి అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.  1913 డిసెంబర్‌ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.
veteran telugu film producer k raghava passed away
అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు.  తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, జగత్ జంత్రీలు, వంటి సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు.

దర్శక రత్న దాసరితో పాటూ ఎంతోమంది నటుల్ని తెలుగు ఇండస్ట్రీకి ఈయనే పరిచయం చేశారు. అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు కూడా.   కె.రాఘవ మృతిపై టాలీవుడ్‌తో పాటూ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్‌, భానుచందర్‌లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: