ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని పక్కన సపోర్ట్ రోల్ లో నటించిన కుర్రాడు పెళ్లిచూపులు సినిమాలో ఓ లవర్ బోయ్ గా కనిపించి అలరించాడు. ఆ సినిమా హిట్ తో అందరికి నోటెడ్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో అందరిక్ ఫేవరెట్ గా మారాడు. ప్రస్తుతం యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ తన ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాడు.


తనని ఇష్టపడే వారంతా రౌడీస్ అంటూ రౌడీ గ్యాంగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఏం చేసినా సరే రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ తన స్ట్రాటజీతో స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు.


రీసెంట్ గా గీతా గోవిందం ఆడియో రిలీజ్ కు లుంగీతో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గెస్ట్ గా వచ్చిన బన్ని కూడా విజయ్ లుంగీ లుక్ చూసి షాక్ అయ్యాడు. స్టైలిష్ స్టార్ బన్నికే స్టైలిష్ సర్ ప్రైజ్ ఇచ్చిన విజయ్ మైక్ ఎందుకుంటే మై డియర్ రౌడీస్ అంటూ సంభోదించడం పక్కా యూత్ ను టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. 


అఫ్కోర్స్ అతన్ని ఫాలో అయ్యే వారిలో యూత్ ఆడియెన్స్ ఎక్కువమంది ఉన్నారు. ఒకప్పుడు పవర్ స్టార్ కు కూడా ఇలానే యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు విజయ్ కూడా అలానే యూత్ పల్స్ బాగా పట్టేశాడు. చూస్తుంటే రాబోయే తరం మెగా సూపర్ స్టార్ ఇతనే అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: