అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ హీరోగా ఇప్పటికి ఓ స్టాడర్డ్ ఫాం కొనసాగించడం లేదు. కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కెరియర్ లో కరెంట్ సినిమా పర్వాలేదు అనిపించినా హిట్ కొట్టలేదు. 10 ఏళ్ల కెరియర్ లో హీరోగా సినిమాలైతే చేస్తున్నాడు కాని ప్రేక్షకుల మనసులు గెలవడంలో వెనుకపడ్డాడు సుశాంత్.  


మేనమామ నాగార్జున ఉన్నా సరే ఎలాంటి ఉపయోగం లేదు. అయితే లేటెస్ట్ గా సుశాంత్ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడింది. అతను హీరోగా చేస్తున్న చిలసౌ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. హీరో రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 3న రిలీజ్ అవుతుంది. 


సుశాంత్, రుహాని శర్మ కలిసి నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. మొదటి నుండి సినిమాపై ఆసక్తి పెరగడంతో సినిమాకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. చైతు, సమంతలు మాత్రం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. చిలసౌ ప్రమోషన్స్ లో వారి ప్రేమ గురించి చెప్పి సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. 


చూస్తుంటే సుశాంత్ ఈసారి సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది. ఈమధ్యనే సుమంత్ కూడా మళ్లీరావా సినిమాతో హిట్ కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇదం జగత్, సుబ్రమణ్యపురం సినిమాలు చేస్తున్నాడు. సుశాంత్ కు ఇది హిట్ పడితే మాత్రం మళ్లీ అక్కినేని హీరోలకు లక్ కలిసి వస్తున్నట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: