మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ ఆ ఎంట్రీ ఇచ్చిన నిహారిక తొలి సినిమా ఒక మనసు నిరాశపరచింది. రామరాజు డైరక్షన్ లో నాగ శౌర్యతో కలిసి చేసిన నిహారిక ఒక మనసు పొయెటిక్ పంథాలో సాగడం వల్ల సినిమా జనాలకు ఎక్కలేదు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ తాలూఖా ఆలోచనలతో రెండేళ్లు వెయిట్ చేసింది నిహారిక.


ఇక లేటెస్ట్ గా సుమంత్ అశ్విన్ తో హ్యాపీ వెడ్డింగ్ అంటూ వచ్చింది. ఎం.ఎస్ రాజు తనయుడిగా సినిమాలైతే చేస్తున్నాడు కాని సుమంత్ కు ఏమాత్రం క్రేజ్ రాలేదు. హ్యాపీ వెడ్డింగ్ కు కూడా నిహారిక నటించింది అన్న కాన్సెప్ట్ తోనే ప్రేక్షకులు చూసేందుకు ముందుకొచ్చారు. మెగా ఫ్యామిలీ హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తున్న నిహారికకు సొంత అభిమానుల సపోర్ట్ లేకుండా పోయింది.


మెగా హీరోల సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తేనే సూపర్ హిట్ చేసేస్తారు. అలాంటిది నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సినిమా పర్వాలేదు అని టాక్ వచ్చినా కూడా ఏమాత్రం వసూళ్లను రాబట్టలేదు. ఎలాగోలా శాటిలైట్ రైట్స్ తో సినిమ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది తప్ప డిస్ట్రిబ్యూటర్స్ కు ఇది లాస్ ప్రాజెక్టే అంటున్నారు.


నిహారిక నటన పరంగా కూడా ఈ సినిమాలో ఇంప్రెస్ చేసింది. కాని ఎందుకో మెగా అభిమానులే నిహారికను సరిగా రిసీవ్ చేసుకోవట్లేదు. మెగా హీరోలు ఇంకాస్త నిహారిక సినిమాను ప్రమోట్ చేసి సినిమాపై ఆసక్తి కలిగేలా చేయాలేమో అంటున్నారు. మొత్తానికి మొదటి సినిమా కన్నా హ్యాపీ వెడ్డింగ్ కాస్త బెటర్ అయినా నిహారికకు ఈ సినిమా కూడా నిరాశ కలిగించిందని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: