సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టగానే ఙివితం రంగులమయం అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడ వాస్తవికత మరో విధంగా ఉంటుంది అదృష్టం ఉన్న వారికి అవకాశాలు వస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఒక సారి పాపులారిటీ ని పోగుట్టుకుంటేనే కథ మొదటికి వస్తుంది. పైకి బాగా కనుపించిన లోపల కష్టాలు ఆనుభవించాల్సిందే. తాజాగా ఇలాంటిదే మరో హీరోయిన్ ఉదంతం బయటపడింది.

Image result for shadow women

ఓ సూపర్ హిట్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందా హీరోయిన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాతో ఎన్నో అవార్డులు అందుకుంది. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం కేవలం అవార్డు ఫంక్షన్లు, స్టేజ్ షోలకు మాత్రమే పరిమితమైన ఆ  బ్యూటీ.. ఎట్టకేలకు మరో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంది. అయితే తెలుగులో మరో అవకాశమైతే వచ్చింది కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ మాత్రం అందలేదు. కేవలం ప్రయాణ ఖర్చుల కోసం 5 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ మేరకు తెరవెనక ఓ ప్రొడ్యూసర్ ఆమెకు డబ్బు అందకుండా చేశాడు.

Related image

తనకు అవకాశం ఇవ్వడమే ఎక్కువని, డబ్బు ఇవ్వక్కర్లేదని తనవాళ్ల దగ్గర గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ నిర్మాత. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సినిమాలో ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమెకు కాస్త స్టార్ వాల్యూ ఉంది. ఆమెకు మాత్రం దాదాపు కోటి రూపాయలు సమర్పించుకున్నారు. నిజానికి ఈ హీరోయిన్ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ అందలేదంటూ రిలీజ్ కు ముందు ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా చేస్తే ఉన్న అవకాశాలు కూడా రావని భయపడుతోందామె. అందుకే తన బాధను ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: