బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి మొదలైంది. ఇక్కడ మొదట సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. రెండో సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక తమిళంలో మాత్రం మొదటి సీజన్ చేసిన కమల్ హాసనే రెండో సీజన్ కూడా చేస్తున్నాడు. తెలుగు, తమిళంలో బిగ్ బాస్ రెండో సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.


లక్కీగా ఆడియెన్స్ ఊహించని విధంగా తెలుగు బిగ్ బాస్ లో సర్ ప్రైజ్ జరుగుతుంది. తమిళంలో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ కు రాబోతున్నాడు. అదేంటి అంటే బిగ్ బాస్ లో సినిమా ప్రమోషన్స్ జరుగుతాయని తెలిసిందే. కమల్ దర్శకత్వంలో తానే నిర్మించి నటించిన విశ్వరూపం-2 రిలీజ్ కు రెడీ అయ్యింది. 


ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ తో కలిసి కాసేపు సరదాగా గడపనున్నాడు కమల్ హాసన్. లోకనాయకుడు, ఉత్తమనటుడు కమల్ హాసన్ ను ఇలా కలవడం అంటే హౌజ్ మెట్స్ కు చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆల్రెడీ బిగ్ బాస్ హౌజ్ లో కమల్ వచ్చేశాడు.


దానికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే ఈ వారం కమల్ ఎంట్రీతో తెలుగు బిగ్ బాస్ కు టాప్ రేటింగ్ వచ్చేలా ఉంది. నాని హోస్టింగ్ లో హౌజ్ లో కమల్ బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో ఉండటం ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఓ అద్భుతమని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: