తమిళ డబ్బింగ్ సినిమా లకు తెలుగు లో మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ కు అభిమానులు  కొదువే లేదు. వారి సినిమాలు ఇక్కడ కోట్లు కొల్ల గొడతాయి. దానితో ఇక్కడ వారి సినిమా లకు ఎప్పడు డిమాండ్ ఉంటుంది. అయితే తమిళ  భారీ సినిమాలు కొన్న మన బయ్యర్లంతా గుల్లయిపోయారు తప్ప, డబ్బులు చేసుకోలేదు. ముఖ్యంగా తమిళ్ టాప్ హీరోలు రజనీ, కమల్, సూర్య, కార్తీ ఇలా వీళ్ల సినిమాలు ఏవీ ఇప్పుడు లాభాలు ఇవ్వడంలేదు. దీంతో తమిళ భారీ సినిమాలు కొనేవారు కరువయ్యారు.

Image result for vishwaroopam 2

వచ్చేవారం విడుదలవుతోంది కమల్ హాసన్ విశ్వరూపం-2. ఈ సినిమా విడుదల డేట్ ఇచ్చేసినా, తెలుగు వెర్షన్ ఎవ్వరూ తీసుకుంటున్న దాఖలాలేదు. కమల్ తన స్వంత బ్యానర్ పైనే ఇక్కడ విడుదల చేసుకునే సన్నాహాల్లో వున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల సినిమా విడుదల వారం దూరంలో వున్నా, హడావుడి ఇంకా స్టార్ట్ కాలేదు. లోకల్ బయ్యర్ ఎవ్వరూ లేకుండానే విశ్వరూపం అడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగిపోతోంది.

Image result for vishwaroopam 2

ఆఖరికి ఎన్వీ ప్రసాద్ ను పంపిణీ వ్యవహారాలు చూడమని అప్పగించేసారు. ఇక మరో రెండు మూడునెల్లలో రాబోయే రజనీ రోబో-2ను కూడా కోనేవారు కనిపించడం లేదు. ముందుగా 78 కోట్లకు బేరం సెటిల్ చేసుకుని 20 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చిన ఆసియన్ సునీల్ కు పదికోట్ల వెనక్కు ఇచ్చేసారు. మిగిలిన బకాయికి ఆగస్టు 10 గడుపు తేదీగా పెట్టారు. మరి ఆ తరువాత ఆ సినిమాను ఎవరికి ఇస్తారు అన్నది క్లారిటీలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: