ఒక్క సినిమా చాలు తమలోని టాలెంట్ చూపించేందుకు.. సత్తా చాటేందుకు అన్నట్టుగా నేటి యువ హీరోల కసి కనబడుతుంది. అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో అలాంటి సినిమా అందించడం పెద్ద టాస్కే. అలా డెబ్యూ మూవీనే టాప్ లేచిపోయే హిట్ అందుకున్నాడు కార్తికేయ.


ఆరెక్స్ 100 మూవీ సంచలన విజయం అందుకుంది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 3 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయ్యి 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతికి స్టార్ ప్రొడ్యూసర్స్ ఆఫర్లు ఇస్తున్నారు. త్వరలోనే అతని సెకండ్ మూవీ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.


ఇక హీరో కార్తికేయకు కూడా ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కళైపులి ధను నిర్మాణంలో టి.ఎన్. కృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా సైన్ చేశాదట. సూర్య నువ్వు నేను ప్రేమ సినిమా డైరెక్ట్ చేసిన కృష్ణ డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశాడట. ఆరెక్స్ 100 చూసి ఆ సినిమాకు కార్తికేయ పర్ఫెక్ట్ అని అతన్ని ఫిక్స్ చేశారట.


అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయి అంటున్నారు. మొత్తానికి ఆరెక్స్ 100 సక్సెస్ కార్తికేయకు మరో మంచి ఆఫర్ వచ్చేలా చేసింది. మరోపక్క ఈ సినిమా విజయంలో కీలకమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి అలా ఆరెక్స్ సినిమా వీరందరి కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: