శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. దీనితో ఈ విషయం మీద చాలా మంది హీరోయిన్స్ తమ కు ఎదురైనా అనుభవాలను, అభిప్రాయాలను మీడియా తో పంచు కున్నారు. ఈ క్రమంలో అదితి రావు బాలీవుడ్‌లో కుదురుకునేందుకు పడిన కష్టాలను ఏకరవు పెట్టింది. బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దాని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని అదితి చెప్పింది. 

Image result for lakshmi rai

ఇదే తరహాలో మెగా హీరోయిన్ నిహారిక కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎవరైనా తమకు తాము అంగీకరిస్తేనే అవుతుందనీ, తన అంగీకారం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని నిహారిక అభిప్రాయపడింది. తాజాగా ఇదే అంశంపై రాయ్ లక్ష్మి స్పందించింది. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ తప్పదని స్పష్టం చేసింది.
Image result for lakshmi rai
కొత్తగా వచ్చిన వాళ్లు.. లొంగిపోవడమా? లేదంటే అవకాశాలు వదులుకోవడమా? అనేది వాళ్లే నిర్ణయించుకోవాలని తెలిపింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే మాత్రం కాంప్రమైజ్ కాక తప్పదని క్లియర్ కట్‌గా చెప్పేసింది. అవకాశాల కోసం కాంప్రమైజ్ కావడమనేది చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోందని, తనకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవం ఎదురవనప్పటికీ ఇండస్ట్రీలో తాను గమనించింది మాత్రం ఇదేనని రాయ్ లక్ష్మీ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: