మెగాస్టార్ చిరంజీవి ఇపుడు సైరా మూవీ షూటింగు లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అవుతూండగానే కొత్త సినిమాను లైన్లో పెట్టేశారు మెగాస్టార్  నెక్స్ట్ మూవీ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో  కంఫార్మ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ మెగాస్టార్ ఒకే చేశారని అంటున్నారు. ప్రీ  ప్రొడక్షన్ వర్క్ తో  మాంచి దూకుడు మీదున్న కొరటాల చిరంజీవి ఎపుడు అంటే అపుడు స్టార్ట్ చేయడానికి రెడీ అంటున్నారు.



ఈ క్రేజీ దర్శకుడు ఇప్పటికే భరత్ అను నేను సినిమాతో లేటెస్ట్ హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. తన నెక్స్ట్ చిత్రం చిరంజీవిదేనని పట్టు మీదున్న కొరటాలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఫిల్మ్  నగర్ టాక్. దాంతో  చిరు మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టిన కొరటాల పక్కాగా స్క్రిప్ట్ రెడీ  చేసుకున్నారు. చిరు డేట్లు ఇవ్వడమే తరువాయి షూటింగ్ అంటున్నారు. ఇక సైరా షూటింగ్ మరో రెండు నెలలలో పూర్తి అవుతుందని తెలుస్తోంది.  నవంబర్ తరువాత మెగాస్టార్, కొరటాలా మూవీకి క్లాప్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ విశేషమేంటంటే ఈ మూవీకి కూడా రాం చరణ్ నిర్మాతట. చిరు పక్కన ఎవరు హీరోయిన్ అన్నది ఫైనలైజ్ కాలేదు కానీ ఓ క్రేజీ బ్యూటీ కోసం కొరటాల సెర్చ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: