నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 శని, ఆదివారాల్లో నాని సందడి బాగుంటుంది. ఈమధ్య హౌజ్ లో సెలబ్రిటీస్ రావడం ఎక్కువవడం వల్ల ఆడియెన్స్ కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురిలో బాబు, కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లారు.


ఇక మరో పక్క నందిని, దీప్తి, గణేష్ లు ఇంకా నామినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ లీకుల పుణ్యమాని ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యేది ముందే తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు బిగ్ బాస్ హౌజ్ నుండి నందిని రాయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. 


దీప్తి, గణేష్, నందిని ముగ్గురిలో నందినికి తక్కువ ఓట్స్ వచ్చాయట. సో మొత్తానికి నందిని రాయ్ హౌజ్ నుండి వెళ్లబోతుందన్నమాట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే. కౌశల్ తో గొడవ పడటం వల్ల హౌజ్ మెట్స్ ఎలిమినేట్ అవుతున్నారన్న టాక్ ఉంది.


భాను, తేజశ్వి, నందిని ఇలా ముగ్గురు కౌశల్ తో గొడవ పడి ఆ తర్వాత వారం ఎలిమినేట్ అయ్యారు. కౌశల్ ఆర్మీ వారిని టార్గెట్ చేయడం వల్లే వారికి తక్కువ ఓట్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇలా చూస్తే కౌశల్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: