బాలీవుడ్ లో , టాలీవుడ్ లో ఇప్పడూ బయో పిక్ లా జోరు ఊపందుకున్నది. బయో పిక్ లను కూడా ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు . బాక్స్ ఆఫీస్ లో కాసుల వర్షం కురిపిస్తుంది. టాలీవుడ్ లో రిలీజ్ అయినా మహానటి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అయితే ఇప్పుడు  ఎన్టీఆర్ బయో పిక్ రాబోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే సినిమా, ఆ తరువాతే రాజకీయం, తెలుగువారి ఆత్మగౌరవం వంటి వ్యవహారాలు. అయితే ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలు మొత్తం తొలిసగంలోకి కుదించేస్తున్నారు.

Image result for ntr bio pic

పాపం, ఎన్టీఆర్ పాత్రలు అన్నింటిలో తనను చూసుకోవాలనే బాలయ్య కోరిక ఆ విధంగా అణగారిపోతోంది. ఎందుకంటే, కేవలం మహా అయితే గంటంపావులో ఎన్ని క్యారెక్టర్లు చూపిస్తారు. ఇక అసలు కథ, రాబోయే ఎన్నికలకు ఉపయోగపడే అసలు కథ అంతా మలి సగంలో అన్నమాట. ఢిల్లీ పార్టీ గద్దెదింపడం, ప్రజా ఉద్యమాలు, వాటిల్లో చంద్రబాబు పాత్ర, ఆ వీరోచిత పోరాటం అన్నీ సినిమా క్లయిమాక్స్ ముందు.

Image result for ntr bio pic

 ఆ విధంగా తెలుగుదేశం పోరాటాన్ని మరోసారి రానా అనే చంద్రబాబు పాత్రధారి సాక్షిగా జనాలకు చూపించాలి.  కానీ ఏమైనా రాజకీయం సగం ప్లేస్ ఆక్యుపై చేస్తే, మహిళలు సినిమాకు వస్తారా? మహానటి లాంటి సినిమా అంటే మహిళలు కిలోమీటర్ లైన్ లో వున్నారు కానీ, రాజకీయాలు, స్లోగన్ లు అంటూ కిలోమీటర్ దూరంలో వుంటారు. అప్పుడు వందకోట్ల మార్కెట్ అన్నది కాస్త అనుమానంలో పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: