సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వివాదం నడుస్తుంది. ఇప్పటికే చాలామంది నటీ నటులు కాస్టింగ్ కౌచ్ మీద స్పందించారు. చాలా మంది హీరోయిన్స్ తాము కూడా భాదితులమని మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే ప్రముఖ హీరో అర్జున్ తన కూతురిని  హీరోయిన్ పరిచయం చేసాడు. ఒకప్పుడు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విశాల్ సినిమా ద్వారా అర్జున్ తన కూతురును హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ తనయ పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది.

Image result for arjun hero

ఇలాంటి నేఫథ్యంలో ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఒక నటుడిగా, ఇటు ఒక అమ్మాయికి తండ్రిగా స్పందించాడు అర్జున్. ముందుగా అర్జున్ చెప్పిందేమిటంటే.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని. అందులో సందేహం ఏమీలేదని.. ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉందని ఈ సీనియర్ నటుడు ధ్రువీకరించాడు. ఆ విషయం తెలిసీ.. కూతురును హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారా? అంటే.. ఔను అనే చెప్పాడు అర్జున్.

Image result for arjun hero

‘నిజంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే సినీ పరిశ్రమలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాగని నా కూతురును సినిమాల్లోకి రాకుండా నేను అడ్డుకోవాలా? నా కూతురినంటే అడ్డుకుంటాను.. మరి మిగతావాళ్ల పరిస్థితి ఏమిటి? నా సహనటులు కొంతమంది వాళ్ల కూతుర్లను హీరోయిన్లుగా పంపిస్తున్నారు. అందరన్నీ చూశాకా నేను హీరోయిన్ కావాలనుకున్న నా కూతురును అడ్డుకోలేదు.. అని అర్జున్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: