సినిమా ఇండస్ట్రీలో ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకత చూపిస్తూ.. స్టయిల్ తో తీసే దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి పేరుంది. అది ప్రేమ కథయినా, యాక్షన్ సినిమా అయినా తన స్టయిల్ ముద్ర వేస్తారు.   ఇండ‌స్ట్రీకి సంబంధించి వివిధ రంగాల‌లో ఉన్న వారు వేరే రంగంలోను రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో హీరోలు ద‌ర్శ‌కులు అవుతున్నారు. ద‌ర్శ‌కులు హీరోలుగా మారుతున్నారు.‘జై’ అనే కొత్త దర్శకుడు ఇటీవ‌ల గౌత‌మ్ మీన‌న్‌ని క‌లిసి అద్భుత‌మైన క‌థ వినిపించార‌ట‌.

గౌతమ్ మీనన్ కొత్త యవ్వారం

 ఈ క‌థ ఎంత‌గానో న‌చ్చ‌డంతో క‌థానాయ‌కుడిగా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.   ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'గోలీసోడా 2' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన గౌతమ్ మీనన్.. దర్శకుడిగా 'ఘర్షణ', 'ఏ మాయ చేసావే', 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.    

Image result for గౌతమ్ మీనన్

ఈ మూవీ ఆగ‌స్ట్ 15న పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. ఈ మూవీలో ‘నాచ్చియార్’ ఫేమ్ ఇవానా ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. దర్శకుడిగా, నిర్మాతగా దక్షిణాది సినీరంగంలో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న గౌతమ్ మీనన్ ఇపుడు నటుడిగా ఎలా అలరిస్తాడో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: