బయటేమో కౌశల్ కు ఓ క్రేజీ ఆర్మీ గ్యాంగ్ ఉండగా ఇంట్లో మాత్రం కౌశల్ కు ఒకరి తోడుగా మరొకరు ఇలా అందరు యాంటీ అవుతూ వస్తున్నారు. ముందునుండి కౌశల్ మీద మిగతా ఇంటి సభ్యులంతా వ్యతిరేకత ఉంది అదే అతనికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. ఇక ఇప్పుడు కౌశల్ కు బయట జరుగుతున్న సినిమా అంతా నూతన్ నాయుడు చెప్పే ఉంటాడు.


ఇక మనోడు బిగ్ బాస్ హౌజ్ లో మరింత రెచ్చిపోతున్నాడు. అందరిది ఒకదారైతే తనది మరోదారి అనేలా ఉంది కౌశల్ ప్రవర్తన. కేవలం తను ఒక్కడే ఒక టీం మిగతా వారంతా మరో టీం అన్నట్టుగా పరిస్థితి కబడుతుంది. టాస్క్ ఏదైనా.. డిస్కషన్ ఏదైనా కౌశల్ చాలా మొండిగా వాధిస్తున్నాడు అన్నది కంటెస్టంట్స్ కంప్లైంట్.


మొదట్లో ఇది నచ్చే బిగ్ బాస్ ఫ్యాన్స్ లో సగానికి పైగా కౌశల్ ఫ్యాన్స్ అయ్యారు. అందుకే కౌశల్ గ్యాంగ్ అంటూ ఒకటి ఏర్పరచి అతనితో ఫైట్ చేసిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ నాని కూడా బయట ఉన్న కౌశల్ క్రేజ్ ను ప్రస్థావించి ఇలా ఫ్లిప్ అయితే నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పోతుందని సలహా ఇచ్చాడు.


నాని చెప్పినా సరే కౌశల్ అలానే ఇంటి సభ్యులకు ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఆడుతున్నాడు. అది గేం లో ఒక భాగమే అనుకున్నా ఎక్కడో ఓ చోట హౌజ్ మెట్స్ తో గొడవలు పెట్టుకుంటున్నాడు. ఆల్రెడీ బాబు కౌశల్ మీద కోపంగానే ఉండగా తనీష్ కూడా కౌశల్ చేసే పనుల పట్ల అసంతృప్తిగా ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: