టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ నిన్న తన బర్త్ డే గ్రాండ్ గా జరుపుకున్నారు. అభిమానులే కాదు తారల శుభాకాంక్షలతో మహేష్ బర్త్ డే జరిగింది. అంతేకాదు ఫ్యాన్స్ కు తను ప్రస్తుతం నటిస్తున్న 25వ సినిమా మహర్షి లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. సినిమాలో రిషి రోల్ లో కనబడుతున్న మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొట్టాడు.


ఇక నిన్న మహేష్ బర్త్ డే ఎక్కడ చూసినా మహేష్ హడావిడి ఉంది. ఇక ఈ హంగామా ఏ రేంజ్ లో ఉంది అంటే ఏకంగా 24 గంటల్లో 5 మిలియన్స్ మహేష్ బర్త్ డే ట్వీట్స్ చేయడం జరిగింది. ఇది చాలదు మహేష్ స్టామినా ఏంటో చూపించడానికి. మహేష్ మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.


భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ చూశాక మరింత క్రేజీగా మారిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఏప్రిల్ 5న ఉగాది కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
  


మరింత సమాచారం తెలుసుకోండి: