యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'  ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ గా అభిమానుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 


  నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు వీడియో సాంగ్ ను వదిలారు. "బేబీ .. అనూ బేబీ .." అంటూ ఈ సాంగ్ సాగుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ అలకతో నడుస్తూ వుంటే, ఆమెను టీజ్ చేస్తూ చైతూ పాడే పాట చూస్తుంటే..ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంట్రటైన్ మెంట్ గా కనిపిస్తుంది. గోపీసుందర్ చేసిన ట్యూన్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. 


అంతే కాదు ఈ పాటకు చైతూ కొత్త రకంగా స్టెప్స్ వేయడం కూడా బాగా ఆకర్షిస్తుంది. పాటలో నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనూ మరింత గ్లామరస్ అలరిస్తోంది.  ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు.  ఈ సినిమాలో చైతూ అత్తగారిగా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: