విజయ దేవర కొండ లేటెస్ట్ గా నటించిన సినిమా గీత గోవిందం... అయితే ఈ సినిమా సన్నివేశాలు లీక్ అయినా సంగతి తెలిసిందే. దీనితో చిత్ర యూనిట్ ఒక సారిగా షాక్ కు గురైంది. అయితే ఈ సినిమా లీకుల గురించి హీరో విజయ దేవర కొండ స్పందించాడు.  వైజాగ్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చాలా ఫిలాసఫీ మాట్లాడేశాడు. ఇలాంటి లీకులు తననేం చేయవంటున్న దేవరకొండ, అనుకున్నది సాధిస్తానంటున్నాడు.

Image result for vijay devarakonda

"నన్నేం చేయలేరు. చిన్నప్పట్నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నా. గుర్తింపుకోసం పోరాడుతూనే ఉన్నాను. లైఫ్ నాకు నేర్పించిందే ఇది. ఈ పైరసీని కూడా నేనేదో పబ్లిసిటీ కోసం వాడేస్తున్నానంటూ నన్ను కిందికి లాగే బ్యాచ్ ఒకటి చూస్తోంది. మీ అందరికీ ఒకటే చెబుతున్నా, నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా. మీరు ఏమైనా చేయండి, నాకు నచ్చింది చేస్తా." గీతగోవిందం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చి, వేడుకను ఎంజాయ్ చేయకుండా పైరసీ లింక్స్ డిలీట్ చేసే పనిలో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

Image result for vijay devarakonda

కేవలం ఇదే పనిమీద నిర్మాత బన్నీ వాస్ కూడా ఫంక్షన్ కు రాలేకపోయాడని, ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతుంటే ఇలా లీకులు చేయడం ఏంటని ప్రశ్నించాడు.ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా ఖర్చుచేసి ఈ సినిమాకు రీషూట్స్ కూడా చేశాం. నాకు కంటికి సర్జరీ అయినప్పటికీ పెర్ఫెక్షన్ కోసం మళ్లీ మళ్లీ డబ్బింగ్ చెప్పాను. మేం ఇంత కష్టపడుతుంటే మీరు లీకులు చేస్తారా. నేను ఎన్ని మాటలైనా పడతాను. నాకేం కాదు. కానీ సినిమాను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని  చెప్పినాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: