కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించిన రష్మిక మందన.. తెలుగులో మొదటి సినిమా ఛలోతో హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అమ్మడిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక చూస్తుంటే ఇక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉంది.


అమ్మడు లేటెస్ట్ మూవీ గీతా గోవిందం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది రష్మిక. అర్జున్ రెడ్డి తో యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ గీతా గోవిందం మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మికతో రొమాన్స్ కూడా పీక్స్ లో ఉంటుందట.


సినిమా లీకిన సీన్స్ లో రష్మిక విజయ్ ల లిప్ లాక్ హాట్ న్యూస్ గా మారింది. ముఖ్యంగా రష్మిక కన్నడ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా హర్ట్ అవుతున్నారు. అంతేకాదు ఈ లిప్ లాక్స్ మీద కన్నడలో నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారట. పాపం రష్మిక విజయ్ లిప్ లాక్ వల్ల సొంత ప్రేక్షకులకు అలా బుక్ అయ్యింది.


విజయ్ తో గీతా గోవిందం మాత్రమే కాదు డియర్ కామ్రెడ్ సినిమాలో కూడా నటిస్తుంది రష్మిక. ఇద్దరి పెయిర్ బాగుందని టాక్ రావడంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే కన్నడ ఆడియెన్స్ ఇంతలా హర్ట్ అవడానికి కారణం కిర్రాక్ పార్టె డైరక్టర్ కం హీరో రోహి శెట్టితో రష్మిక పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి రెడీ అవుతూ ఇలాంటి పాడు పనులేంటంటూ ఆమెపై చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి రష్మిక ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: