విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను బన్ని వాసు నిర్మించారు. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.


ఇక ఈ సినిమతో విజయ్ మరోసారి తన సత్తా చాటాడు. విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండ చాలా పరిణితితో నటించాడు. సినిమాలో అతని పాత్ర హైలెట్ అవగా ఆ తర్వాత హీరోయిన్ రష్మిక కూడా అలరించింది. ఇక పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత విజయ్ సత్తా చాటుతూ ఈ సినిమా కలక్షన్స్ ఉన్నాయి.


స్టార్ సినిమాలకు ధీటుగా ఓవర్సీస్ లో విజయ్ గీత గోవిందం సినిమా వసూళ్లు రాబడుతుంది. ప్రీమియర్ ద్వారానే $400k వసూళ్లను రాబట్టింది. వీకెండ్ లోగా 1 మిలియన్ క్రాస్ చేయడం పక్కా అంటున్నారు. పెళ్లిచూపులు సినిమా యూఎస్ లో 50 డేస్ ఆడింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ కూడా విజయ్ స్టామినా ప్రూవ్ చేసింది.


అమెరికాలో స్టార్ హీరోలకు ధీటుగా విజయ్ సినిమాల ఫలితాలు వస్తున్నాయి. ప్రీమియర్స్ ద్వారానే $400k వసూళు చేసిందంటే విజయ్ క్రేజ్ అక్కడ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా ఎలాగు హిట్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా తప్పకుండా విజయ్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: