ఒక్క సినిమా చాలు మాములు హీరోని ఓవర్ నైట్ స్టార్ గా చేయడానికి అయితే స్టార్ అవడం ఒక్కసారే కాని దాని కాపాడుకునే సత్తా ఉండాల్సింది మాత్రం హీరోలకే. ఆ కోవలోనే అర్జున్ రెడ్డితో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.


గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా చూసిన వారందరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సిని సెలబ్రిటీస్ కూడా సూపర్ అనేస్తున్నారంటే సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.


ఇక ఈ సినిమా కలక్షన్స్ తో మరోసారి విజయ్ తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. సినిమా మొదటి రోజు 9.71 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఇది విజయ్ దేవరకొండ సత్తా అని చెప్పొచ్చు. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 1.60 కోట్లు
సీడెడ్ : 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర :  0.56 కోట్లు
ఈస్ట్ : 0.47 కోట్లు
వెస్ట్ : 0.45 కోట్లు 
కృష్ణ : 0.47 కోట్లు 
గుంటూరు : 0.60 కోట్లు
నెల్లూరు : 0.24 కోట్లు
కర్ణాటక : 0.61 కోట్లు
యూఎస్ : 2.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 0.96 కోట్లు 
వరల్డ్ వైడ్ : 9.71 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: