త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతీ తెలిసిందే. అయితే ఈ టీజర్ ఎన్టీఆర్ అభిమానులకు విపరీతంగా నచ్చింది యూట్యూబ్ లో రికార్డ్స్ బద్దలు కొట్టింది. అయితే ఈ టీజర్‌ చూసి త్రివిక్రమ్‌ తరహా వినోదాత్మక చిత్రాలు చూసే వారు మాత్రం డిజప్పాయింట్‌ అయ్యారు. అసలు త్రివిక్రమ్‌ ముద్రే లేదని, బోయపాటి శ్రీను సినిమా టీజర్‌లా వుందని కామెంట్‌ చేస్తున్నారు.

Image result for aravinda sametha trailer

నిజానికి ఎన్టీఆర్‌తో సినిమా అనుకున్నపుడు 'నువ్వు నాకు నచ్చావ్‌' లాంటి వినోదాత్మక చిత్రం చేయాలనేది త్రివిక్రమ్‌ ఐడియా. ఎన్టీఆర్‌ కూడా అతడిని అలాంటి సినిమానే కావాలని అడిగాడు. అయితే 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌ అవడంతో త్రివిక్రమ్‌ డిఫెన్స్‌లో పడ్డాడు. ఎన్టీఆర్‌తో ఫ్యామిలీ సినిమా అంటే రిజల్ట్‌ ఎలాగైనా వుండొచ్చు. అందుకే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ మాస్‌ సినిమా తీస్తూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నట్టున్నాడు.

Image result for aravinda sametha trailer

ఇది ఎన్టీఆర్‌ అభిమానులకి రుచించవచ్చు గానీ త్రివిక్రమ్‌ తరహా వినోదాత్మక చిత్రాలని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంతవరకు లైక్‌ చేస్తారనేది చెప్పలేం. ఒక్క ఫ్లాప్‌కే త్రివిక్రమ్‌ తీరు మార్చేసుకోవడం ఏమీ బాలేదని అతడి వీరాభిమానులు అంటున్నారు.  అయితే టైటిల్‌ సాఫ్ట్‌గానే వుంది కనుక ఈ ముప్పయ్‌ సెకన్ల టీజర్‌ చూసేసి సినిమా అంతా ఇలాగే వుంటుందని జడ్జ్‌ చేయకూడదమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: