రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు రంగ స్థలం సినిమా తో దిమ్మ తిరిగే ఇండస్ర్టీ హిట్ కొట్టాడు ఇప్పడూ అదే ఊపు మీద బోయపాటి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు అయితే రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ ,మురుగ దాస్ సినిమా లో నటించనున్నాడని ఇండస్ట్రీ లో మాటలు వినిపిస్తున్నాయి. దీనితో రామ్ చరణ్ అభిమానులు కూడా భయ పడుతున్నారు . ఎందుకంటే ఇంకా అందరికీ స్పైడర్ సినిమా ఫలితం గుర్తే ఉంటుంది. 

Image result for ram charan

ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ కూడా జ‌రిగింద‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే ఇదే ఏడాది చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంటున్నారు. చ‌ర‌ణ్ కు జ‌క్క‌న్న సినిమా ఉన్నా..డేట్లు స‌ర్దుబాటు అయ్యే అవ‌కాశం ఉంద‌ట‌. ముర‌గ‌దాస్ క‌థ‌లు ఊహ‌కంద‌న‌వి. యూనిక్ స్టోరీల‌తో సినిమాలు చేయ‌డం అత‌నొక్క‌డికే చెల్లింది. మ‌రి చ‌ర‌ణ్ ను ఎలాంటి క‌థ‌లో చూపించ‌నున్నాడో? `ధృవ` సినిమాతో క‌థ‌ల విష‌యంలో మార్పు తీసుకున్న చ‌ర‌ణ్ అప్ప‌టి నుంచి యూనిక్ గానే వెళ్తున్నాడు.

Image result for AR murugadoss

వైవిథ్య‌మైన క‌థ‌ల కోసం ప‌రిత‌పిస్తున్నాడు. కొత్త‌గా చేయాలి.. కొత్త‌గా క‌నిపించాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్‌-ముర‌గ‌ల‌కు లంకె ప‌క్కాగా కుదురుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ముర‌గ‌దాస్ ` స్పైడ‌ర్` సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయింది. 70 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమాకు భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: