నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఈమధ్య ఆడియెన్స్ లో కూడా మంచి క్యూరియాసిటీ పెంచేలా చేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకు కంటెస్టంట్స్ హంగామా చూస్తూనే ఉన్నాం ఇక వీకెండ్ వస్తే నాని అలరించేస్తాడు. ప్రతి వారం లానే ఈ వారం కూడా వచ్చిన నాని తనీష్, కౌశల్, అమిత్ లను టార్గెట్ చేశాడు. 


గడిచిన వారానికి కెప్టెన్ అయిన తనీష్ తన కెప్టెన్సీని ఏమాత్రం సాటిస్ఫైడ్ గా చేయలేదని అన్నాడు. కెప్టెన్ అయ్యుండి తానే స్టోర్ రూంలోకి వెళ్లి నిద్రపోవడం తద్వారా బిగ్ బాస్ ఇచ్చిన శిక్షని అమలు చేయకపోవడం పై తనీష్ పై నాని రుసరుసలాడాడు. ఇక అమిత్ విషయంలో కూడా నాని రెండు వారాలు సేఫ్ కార్డ్ పూర్తయిందని అన్నాడు.   


కమల్ హాసన్ వచ్చినప్పుడు అమిత్ ఎక్కడి నుండో వచ్చి తెలుగు సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని అమిత్ కోసం సేఫ్ కార్డ్ ఇచ్చాడు. రెండు వారాలు అతను ఎలిమినేట్ అవకుండా ఆ కార్డ్ ఉపయోగపడింది. అయితే ఈ రెండు వారాలు గేమ్ లో కూడా అంత సాటిస్ఫైడ్ గా ఆడలేదు అన్నది నాని వర్షన్. ఇక కౌశల్ కు నాని సలహాలిచ్చాడు. 


నామినేషన్ టైంలో తానొక్కడినే పోరాటం చేస్తున్నా అని చెప్పడం నీకు సపోర్ట్ చేస్తున్న ఇంటి సభ్యులను అవమానించినట్టే అవుతుందని.. కాల్ సెంటర్ టాస్కులో కూర్చున్న చోటే యూరిన్ పోసేందుకు సహకరించారన్న విషయం గుర్తుచేసి మిగతా వారి గురించి నీ వైపు నుండి వైబ్ రావాలని అన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న గీతా, శ్యామలాలను సేఫ్ చేసి దీప్తి, రోల్, పూజాలను కన్ ఫ్యూజన్ లో పెట్టాడు నాని.  



మరింత సమాచారం తెలుసుకోండి: