రచయితగా తన పెన్ పవర్ చాటుతూ వచ్చిన త్రివిక్రం దర్శకుడిగా కమర్షియల్ సినిమాలే చేస్తున్న అందులో కూడా తన కలాన్ని బాగా వాడుతాడు. చెప్పే విషయం ఏదైనా అందులో తన మాటల అర్ధం అబ్బో అనిపించేలా చేస్తుంది. హీరో ఎవరైనా త్రివిక్రం తో సినిమా అంటే ఇదవరకు ఎలాంటి ఇమేజ్ ఉన్నా సరే అది మారిపోవాల్సిందే. 


అజ్ఞాతవాసి ఎఫెక్టో ఏమో కాని ఎన్.టి.ఆర్ తో చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా టీజర్ లో త్రివిక్రం మార్క్ కన్నా ఎన్.టి.ఆర్ కమర్షియల్ అంశాలే ఎక్కువగా కనిపించాయి. అరవింద సమేత టీజర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ సూపర్ అనేయగా కేవలం త్రివిక్రం పెన్ పవర్ మెచ్చే సిని ప్రియులకు అది నిరాశపరచింది.


ముందు సినిమా ఫ్లాప్ అవడం వల్ల త్రివిక్రం కాస్త వెనక్కి తగ్గాడని తెలుస్తున్నా మరి ఇంతలా మారిపోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అరవింద సమేత టీజర్ లో త్రివిక్రం ఎక్కడ కనిపించలేదన్నది కొందర్ ప్రేక్షకుల మాట. ఇదేదో బోయపాటి, వినాయక్ సినిమాల మాదిరిగా ఉందని అంటున్నారు.


కేవలం నందమూరి ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే త్రివిక్రం ఈ సినిమా చేస్తే తన రెగ్యులర్ సిని లవర్స్ కు నిరాశ కలిగించినట్టే అవుతుంది. మరి నిజంగానే త్రివిక్రం తన పంథా మార్చుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే అక్టోబర్ 11దాకా వెయిట్ చేయాల్సిందే. మరి అరవింద సమేత అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: