బిగ్ బాస్ ఈవారం ఎలిమినేషన్ లో దీప్తి సునైనా ఎలిమినేట్ అవడం జరిగింది. గడిచిన వారంలో బిగ్ బాస్ కాల్ సెంటర్ టాస్కులో ఆమె కౌశల్ తో ప్రవర్తించిన తీరు బయట ఉన్న కౌశల్ అభిమానులకు నచ్చలేదు. అప్పటి నుండే దీప్తి సునైనాపై కౌశల్ ఆర్మీ నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.  


వారి టార్గెట్ కు బలైన దీప్తి ఏకంగా ఈరోజు హౌజ్ నుండి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ షో కౌషల్ హీరోగా మారాడు. హౌజ్ మెట్స్ అంతా కౌషల్ ను టఫ్ ఫైటర్ గా చూస్తున్నారు. అందుకే ఛాన్స్ దొరికితే అతన్ని కార్నర్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. బయట ఉన్న కౌశల్ ఆర్మీ ఎవరైతే హౌజ్ లో కౌశల్ తో గొడవపడతారో వారిని ఎలిమినేట్ చేస్తున్నారు.  


భాను శ్రీ నుండి ఈరోజు జరిగిన దీప్తి సునైనా వరకు కౌశల్ తో పెట్టుకుంటే హౌజ్ నుండి బయటకు వచ్చేసినట్టే అని టాక్ మరింత బలపడింది. ప్రతివారం ఇది జరుగుతూనే ఉంది. కౌశల్ కు బయట పెరిగిన విపరీతమైన ఫాలోయింగ్ బిగ్ బాస్ కు టి.ఆర్.పి పరంగా మేలు చేస్తున్నా ఎలిమినేషన్ మాత్రం వారి నిర్ణయమే అనేలా కనిపిస్తుంది. 


ఇలా చూస్తూ పోతే కౌశల్ కు బిగ్ బాస్ 2 విన్నర్ గా టైటిల్ ఇచ్చే దాకా ప్రేక్షకులు కౌశల్ కు సపోర్ట్ ఇచ్చేలా ఉన్నారు. అంతేకాదు షో హైదరాబాద్ లో జరుగుతుండటం వల్ల ఎలిమినేషన్ కూడా ముందు లీక్ అవుతుంది. మరి దీని గురించి బిగ్ బాస్ నిర్వాహకులు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: