ఒకప్పుడు తెలుగు బాకాఫీస్ మీద తమిళ సినిమాల సత్తా బాగా చూపించేవి ఇప్పుడు పరిస్థితి మారింది. మన సినిమాలు రికార్డులు సృష్టిస్తుంటే డబ్ అయిన తమిళ సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడుతున్నాయి. రజిని, కమల్ సినిమాలే కాదు సూర్య కార్తి సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు.


ఈ క్రమంలో మరో తమిళ హీరో విశాల్ సినిమాలు కాస్త కూస్తో మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. అభిమన్యుడు సినిమా తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఆ క్రేజ్ తో విశాల్ ప్రస్తుతం చేస్తున్న పందెం కోడి-2 సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. 2005లో వచ్చిన పందెం కోడి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.


లింగుసామి డైరక్షన్ లో వచ్చిన పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా పందెం కోడి-2 అదే దర్శకుడు చేస్తున్నాడు. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న కీర్తి సురేష్ పందెం కోడి-2లో నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.


ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ను 10 కోట్లకు కొన్నారట ఈమధ్య తమిళ సినిమాల్లో అత్యధిక రేటుకి కొన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఆంధ్రాలో 6 కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమాను గుంటూరు, నెల్లూరు రైట్స్ యువి క్రియేషన్స్ దక్కించుకున్నారట. నైజాంలో మాత్రం విశాల్ సొంతంగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అభిమన్యుడు సినిమా 7 నుండి 10 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఈ సినిమా 10 కోట్ల బిజినెస్ తో వస్తుంది. మరి విశాల్ పందెం కోడి సీక్వల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: